యెస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా అరెస్ట్

by Shamantha N |
యెస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా అరెస్ట్
X

యెస్ బ్యాంకు వ్యవస్థాపకు రానా కపూర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్, మరో కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన రుణాల విషయంలో కపూర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయన్ను గత రెండు రోజులుగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి 20 గంటల పాటు ప్రశ్నించారు. విచారణకు సహకరించలేదన్న కారణంతో కపూర్‌ను ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. నేడు కపూర్‌ను కోర్టులో హాజరుపర్చి కస్టడీ కోరే అవకాశం ఉంది.

Advertisement

Next Story