లొంగిపోండి.. మావోయిస్టులకు పిలుపునిచ్చిన రామగుండం సీపీ

by Anukaran |
లొంగిపోండి.. మావోయిస్టులకు పిలుపునిచ్చిన రామగుండం సీపీ
X

దిశ, బెల్లంపల్లి: అడవి బాటను వీడి మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ (ఆనంద్) కుటుంబ సభ్యులను కలిసిన ఆయన పండ్లు, దుస్తులు అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సాధ్యం కాని సిద్ధాంతాలు, ఆశయాలతో అడవిలో ఉంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తప్పా వారు సాధించేదేమి లేదన్నారు. అజ్ఞాత జీవనం గడుపుతున్న మావోయిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ప్రస్తుతం కరోనా వైరస్ వచ్చి అడవిలో ఉంటున్న వారు జనజీవన స్రవంతిలో కలిస్తే.. మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. కనీసం ఇప్పటికైనా లొంగిపోయి కుటుంబంతో సంతోషంగా గడపాలని రామగుండం పోలీస్ కమిషనర్ కోరారు.

Advertisement

Next Story