- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి దేహమంతా శ్రీరామ స్మరణే..
దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రమ్నమి అనే విభాగానికి చెందిన వ్యక్తులను నిజమైన రామభక్తులుగా పేర్కొనవచ్చు. అందులో ఎలాంటి సందేహం వద్దు. కారణం వీరికి శ్రీరాముడిపై అచంచలమైన విశ్వాసం ఉంది. వీరు ఆలయంలో పూజలు చేయరు. విగ్రహారాధనపై వీరికి పెద్దగా నమ్మకం లేదు. బదులుగా శ్రీరాముడి పేరును శరీరమంతా పచ్చబొట్టు పొడిపించుకుంటారు. అంతేకాదు ఇండ్ల గోడలపై, తలుపులు, కిటికీల మీద ప్రతిచోటా శ్రీరాముడి పేరు కనిపించేలా చేస్తారు.
ఈ సంప్రదాయం చెడును ఎదుర్కోవటానికి ఎన్నో ఏండ్ల కిందట ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైంది. రమ్నమి విభాగానికి చెందిన మెహతార్ లాల్ టాండన్ వయసు 76 ఏండ్లు. గత 54 ఏండ్ల కిందట అయోధ్యలోనే రామ్ అని అతని శరీరంపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. అప్పుడు టాండన్ వయసు 22ఏండ్లు. రామనవమి రోజున అయోధ్యకు వెళ్లినప్పుడు అక్కడ ఒక పూజారి తన ముఖం మీద రామ్ అని రాశారు’ అని మెహతార్ చెప్పారు.
ఒక వర్గం వారిని గుడిలోకి రానివ్వకపోవడంతో వారు అలా శరీరంపై రామ్ అని పచ్చబొట్టు వేసుకోవడం మొదలెట్టారనే కథ కూడా ప్రచారంలో ఉన్నది. అందుకనే వీరు తమ దేహాన్ని దేవాలయంగా భావిస్తారని చెప్తుంటారు. రమ్నమి విభాగంలో ప్రస్తుతం 400-500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. చార్పారా గ్రామంలో పరశ్రాం అనే దళిత యువకుడు 1890లో రమ్నమిని ప్రారంభించారని అక్కడి వారు చెప్తుంటారు. ఆలయానికి వెళ్లడం, విగ్రహాన్ని పూజించే బదులుగా రోజంతా రాముడి స్వరం వింటూనే ఉంటారంటా వీరంతా. అందుకే వీరిని నిజమైన రామభక్తులుగా చెప్పుకోవడంతో ఆశ్చర్యమేమీ లేదు.