ఎందరికో సహాయం చేసిన మీకు ధన్యవాదాలు: Ram Charan

by Shyam |   ( Updated:2021-06-05 07:03:13.0  )
ఎందరికో సహాయం చేసిన మీకు ధన్యవాదాలు: Ram Charan
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ కష్టకాలంలో సమాజ సేవ చేస్తున్న అభిమానులకు హీరో రామ్ చరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అభిమానులు ఈ కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను, అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సహాయం చేయటం నుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వరకు మీరు ఎంతో అంకితభావంతో పని చేశారు. ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికీ పేరు పేరున నా శుభాభినందనలు.. మీ అందరి అంకిత భావానికి నా ధన్యవాదాలు’ అంటూ రామ్‌చరణ్ ఫాన్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed