అన్నాచెల్లెల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్

by Shyam |
అన్నాచెల్లెల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్
X

దిశ, సిద్దిపేట: రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ఆదివారం రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో ” రాఖీ రక్షణ కవచం ” చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నా చెల్లెల ఆత్మీయ బంధానికి రక్షణ కవచం రక్షాబంధన్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతిని ఎల్లవేళలా కాపాడుకుంటూ.. రాఖీ పౌర్ణమి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు శాంతిసౌభాగ్యాలు అందించాలని అన్నారు. ప్రపంచ మానవాళి భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్‌‌ను అధిగమించాలని రుస్తుం ఆకాక్షించారు.

Advertisement

Next Story