ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ అస్తానా

by Shamantha N |
rakesh asthana
X

న్యూఢిల్లీ: గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ అస్తానా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియామకమయ్యారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా, ఆయనను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమించింది. బీఎస్ఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలను ఐటీబీపీ డీజీ ఎస్ఎస్ దేస్వాల్‌కు అప్పగించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతల్లో ఉండనున్నారు.

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ అస్తానా వచ్చే ఏడాది జులై 31 వరకు సేవలందించనున్నారు. ఆయన ఈ నెల 31న పదవీ విరమణ పొందాల్సి ఉన్నది. కానీ, కేంద్రమే ఆయన పదవీకాలాన్ని ‘ప్రజా ప్రయోజనం’ కోసం మరో ఏడాది పొడిగించింది. స్టేట్, సెంట్రల్ క్యాడర్‌లో పనిచేసిన ఆయన గతంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా సేవలందించారు. అప్పటి సీబీఐ చీఫ్ అలోక్ వర్మతో బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇరువురూ అవినీతి ఆరోపణలు చేసుకుని సంచలనానికి కేంద్రమయ్యారు.

Advertisement

Next Story