- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్..? కట్టలు తెంచుకున్న జర్నలిస్టుల ఆగ్రహం
దిశ, జగిత్యాల : మీడియా రిపోర్టర్ పై పోలీసులు దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన తోటి జర్నలిస్టు మిత్రులు రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఆదివారం వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. వార్తను కవరేజ్ చేస్తున్న రాజ్ న్యూస్ రిపోర్టర్ రఫీ పై ఎస్ఐ నాగరాజు, సీఐ రమణ మూర్తి ఇతర పోలీసు అధికారులు దాడి చేశారు. పోలీసుల చర్యపై ఆగ్రహించిన మీడియా మిత్రులు కరీంనగర్ – జగిత్యాల రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. అంతకుముందు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్‌లో గత రాత్రి కోళ్ల వ్యాన్ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. బాధిత వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మృతదేహన్ని రోడ్డు మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వార్త కవరేజ్‌కు వెళ్లిన రిపోర్టర్ రఫీతో పోలీసులు, ఇతర అధికారులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మొబైల్ ఫోన్లు లాక్కొని అతని మీద దాడి చేశారు. ఈ విషయం తెలియడంతో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల సంఘాలు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తోటి జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.