భారీ మొత్తంలో విరాళం అందించిన రజనీకాంత్

by Shyam |   ( Updated:2021-05-17 02:06:36.0  )
భారీ మొత్తంలో విరాళం అందించిన రజనీకాంత్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సెక్రటేరియట్‌లో స్టాలిన్‌ను కలిసిన ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షల విరాళం అందించారు. కాగా ఇంతకు ముందు రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ కోటి రూపాయలు, స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ కలిసి కోటి రూపాయలు అందించిన విషయం తెలిసిందే. ఇక తలైవా తన నెక్స్ట్ ఫిల్మ్ ‘అన్నాత్తె’తో మళ్లీ బిజీ అయిపోనున్నారు. గతంలో హైదరాబాద్‌లో షూటింగ్ సమయంలో తను అస్వస్థతకు లోను కావడంతో షూటింగ్ ఆపేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story