రజినీ – ది లెజెండ్: బేర్ గ్రిల్స్

by Shyam |
రజినీ – ది లెజెండ్: బేర్ గ్రిల్స్
X

సూపర్ స్టార్ రజినీకాంత్… యూనిక్ స్టైల్, సపరేట్ మేనరిజంతో సినిమా ఐకాన్‌గా మారాడు. 70 ఏళ్ల వయస్సులోనూ హీరోగా ఇరగదీస్తున్నాడు. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీకి కూడా రెడీ అవుతున్న రజినీ… ఈ మధ్య బేర్ గ్రిల్స్‌తో కలిసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌లో పాల్గొని కొత్త అనుభవాన్ని పొందాడు. కర్ణాటకలోని బందీపూర్ అడవుల్లో షూటింగ్ జరగగా… ఆ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందా? అనే కుతూహలంలో ఉన్నారు రజినీ ఫ్యాన్స్. నెల రోజులుగా ఈ ప్రోగ్రామ్ కోసం ఎదురుచూస్తున్నారు.

డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే మ్యాన్ వర్సెస్ చైల్డ్ ప్రోగ్రాంపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చింది ఆ ఛానల్ యాజమాన్యం. రజినీ, బేర్ గ్రిల్స్ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కాబోతుందంటూ ఓ ప్రోమో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా బేర్ గ్రిల్స్ రజినీతో పనిచేసిన మోమెంట్స్‌ షేర్ చేసుకున్నారు. రజినీకాంత్ ఆత్మవిశ్వాసం ఉన్న స్టార్ హీరో అని, తనను చాలా దగ్గరగా, కొత్తగా చూసే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. తలైవా లాంటి లెజెండ్‌తో టైమ్ స్పెండ్ చేయడం చాలా నచ్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్టార్స్‌తో కలిసి పనిచేశానని, కానీ రజినీతో చేసిన ఈ ప్రోగ్రామ్ చాలా స్పెషల్ అని ట్వీట్ చేశారు. లవ్ ఇండియా అంటూ పోస్ట్ చేశారు బేర్ గ్రిల్స్. ఇది కాస్త సోషల్ మీడియాలో #TalaivaOnDiscovery ట్యాగ్‌తో ట్రెండ్ అయింది.

Advertisement

Next Story