- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా బిల్లులు
జైపూర్: పంజాబ్, ఛత్తీస్‌గడ్‌ల తర్వాత రాజస్తాన్ కూడా కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అత్యవసర సరుకుల బిల్లు 2020, ఫార్మర్స్ అగ్రీమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్, ఫార్మ్ సర్వీసెస్ బిల్లు 2020, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్, కామర్స్ బిల్లు 2020లను ఆయన ప్రవేశపెట్టారు. కోడ్ ఆఫ్ ప్రొసీజర్ బిల్లునూ సమావేశం ముందుంచారు. అనంతరం ప్రణబ్ ముఖర్జీ సహా ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ నేతలకు సంతాపంగా సమావేశాన్ని వాయిదా వేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే మూడు కొత్త సాగు చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని, అందులోని వివాదాస్పద అంశాలతో దేశవ్యాప్తంగా రైతులు ధర్నాలకు దిగారని రాజస్తాన్ మంత్రి ప్రతాప్ కచరియవాస్ విలేకరులకు తెలిపారు. కేంద్ర సర్కారు రైతులకు అబద్ధాలు వల్లిస్తున్నదని, తాము వారి హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని, పంజాబ్ తరహాలోనే తామూ ఈ బిల్లులను ప్రవేశపెట్టామని వివరించారు. రాజ్యాంగంలోని 254(2) అధికరణం కింద రాష్ట్రాలూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాల్లో మార్పులు చేసే వీలును కలిగి ఉంటాయి. అయితే, ఆ బిల్లులకు రాష్ట్రపతితో ఆమోదముద్ర వేసుకోవాలసి ఉంటుంది. స్పందనల కోసం కేంద్ర హోం శాఖకు రాష్ట్రపతి పంపవచ్చు. అవసరమైతే కేంద్ర మంత్రివర్గం సలహాలనూ కోరవచ్చు.