వరుణ ప్రకోపం.. లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి చేరిన నీరు

by Shyam |
వరుణ ప్రకోపం.. లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి చేరిన నీరు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని రహదారులు అన్ని నీటి ప్రవహంతో నిండిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామంలో వర్షానికి వాగు పొంగిపొర్లింది. అనుకోకుండా వచ్చిన ఓ ఆవు, మూడు గేదెలు వాగులో కొట్టుకుపోయాయి. అందులో కుమ్మరి బాలరాజుకు చెందిన ఆవు మృతి చెందింది. అలాగే మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనికి వర్షపు నీరు వచ్చి చేరింది. ఆలయ పూజారులు, సిబ్బంది వర్షపు నీటిలోనే ఉండిపోయారు. సుమారు మోకాలి వరకు నీరు రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed