తెలంగాణకు రెండ్రోజుల పాటు వర్ష సూచన

by Shyam |
Rain in telangana
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతుండగా, మరోవైపు వైపు ఎండలు మండుతుండగా.. మరో వైపు అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. తాజాగా… నైరుతి మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల నుంచి మరాఠ్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్‌ కర్ణా‌టక వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉప‌రి‌తల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభా‌వంతో రాష్ట్రంలో రెండ్రోజుల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవ‌కాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకటి రెండు‌చోట్ల పిడు‌గులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Advertisement

Next Story