పట్టాలెక్కి రైతుల నిరసన.. రైలు రోకో ప్రశాంతం!

by Shamantha N |
పట్టాలెక్కి రైతుల నిరసన.. రైలు రోకో ప్రశాంతం!
X

న్యూఢిల్లీ : రైతులు దేశవ్యాప్తంగా చేపట్టిన రైల్ రోకో ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల అన్నదాతలు, కార్మికసంఘాలు, కార్యకర్తలు రైలు పట్టాలపై కూర్చుని ఆందోళనలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నిరసనలు సాగించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా గురువారం నాలుగు గంటలపాటు ‘రైల్ రోకో’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ 20 కంపెనీలు అదనపు బలగాలను మోహరించింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో బలగాలను ఎక్కువగా మోహరింపజేసింది. కాగా, నిరసన ముగిసిన గంట వ్యవధిలోనే దేశవ్యాప్తంగా రైళ్లు సాధారణ సమయాల్లోనే నడుస్తున్నాయని, ఎలాంటి అంతరాయాలు లేవని ప్రకటించింది. రైల్ రోకోతో పలుచోట్ల ట్రైన్‌లను అడ్డుకున్నప్పటికీ ప్రధాన జోన్‌లలో రైళ్ల రాకపోకలకు పెద్దగా అంతరాయం ఏర్పడలేదని రైల్వే శాఖ ప్రతనిధి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed