విలన్‌తో హీరోయిన్ డేటింగ్.. గిల్టీగా అనిపించిందట!

by Shyam |   ( Updated:2021-08-04 09:07:42.0  )
Rahul Dev, Mugdha Godse
X

దిశ, సినిమా: విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ దేవ్.. భార్య చనిపోయిన తర్వాత మరోకరి ప్రేమను పొందినట్లు తెలిపాడు. తాజాగా ఓ రేడియో ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన.. 2009లో భార్య రీనా చనిపోయిన తర్వాత షూటింగ్‌లతో బిజీగా ఉన్నా ఒంటరిగానే అనిపించిందని తెలిపాడు. 2013లో నటి ముగ్ధా గాడ్సే రూపంలో తన పార్ట్‌నర్ కనుగొన్నానని, అప్పటి నుంచి తనతో డేటింగ్‌లో ఉన్నానని చెప్పాడు. అయితే విషయాన్ని పబ్లిక్‌గా చెప్పేందుకు భయపడ్డానని తెలిపాడు. ముఖ్యంగా తన కొడుకుకు తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో అనే భయంలో ఉండిపోయానన్న ఆయన.. తనకు తెలిశాక పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేశాడని చెప్పాడు. ఇక ముగ్ధా గాడ్జే తనకన్నా చాలా చిన్నదని, తనతో డేటింగ్ చేసేటప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యానని వివరించాడు.

Advertisement

Next Story