నాశనానికి నాలుగేళ్లు : రాహుల్ గాంధీ

by Anukaran |
నాశనానికి నాలుగేళ్లు : రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, కేవలం మోడీ మిత్రులకు మాత్రమే కలిసొచ్చిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ‘ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. నేడు, బంగ్లాదేశ్ మనదేశం కంటే ముందుకు ఎలా వెళ్లింది? దీనికి కారణం కొవిడ్ కాదు. నోట్ల రద్దు, జీఎస్టీలే కారణం. ఎందుకంటే కొవిడ్ ఆ దేశంలోనూ ఉన్నది కదా.

నాలుగేళ్ల క్రితం ప్రధాని మోడీ దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేశారు. కార్మికులు, కర్షకులు, చిన్నవ్యాపారులను నష్టపరిచారు. మన్మోహన్ సింగ్ చెప్పినట్టే ఆర్థిక వ్యవస్థ రెండు శాతం నష్టపోయింది’ అని తెలిపారు. ‘నోట్ల రద్దు నిర్ణయంపై నల్లధనాన్ని వెలికితీయడానికి ప్రధాని చెప్పారు. కానీ, అదంతా వట్టి అబద్ధం. నిజానికి దాడి నల్లధనం మీద కాదు.. మీ మీదే. ప్రధాని మోడీ తన ఆశ్రిత పెట్టుబడిదారి మిత్రులకు ఇవ్వడానికి మీ నుంచి డబ్బులు తీసుకున్నారు. వాళ్లు క్యూలో నిలబడలేదు. మీరు నిలుచున్నారు.

మీరు మీ డబ్బును బ్యాంకుల్లో పెట్టారు. ఆ డబ్బును మోడీ ఆయన మిత్రులకు ఇచ్చుకున్నారు. వారికి చెందిన రుణాల్లో రూ. 3,50,000 కోట్ల మాఫీ చేశారు’ అని ఆరోపించారు. ‘తప్పుడు జీఎస్టీని అమలు చేసి చిన్న, మధ్య తరహా వ్యాపారాలను నాశనం చేశారు. తద్వారా ఆయన ముగ్గురు లేదా నలుగురు మిత్రులకు వ్యాపార మార్గాలకు దారి సుగమనం చేశారు. ఇప్పుడు కొత్త సాగు చట్టాలతో రైతులను సమాధి చేయాలనుకుంటున్నారు’ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed