- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ సీనియర్లపై రాహుల్ గాంధీ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్లపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో నాయకత్వాన్ని మార్చాలంటూ 23మంది నేతలు లేఖ రాయడంపై సీడబ్ల్యూసీ సమావేశంలో కల్పించుకున్న ఆయన నేతలపై మండిపడ్డారు. అమ్మ ఆస్పత్రిలో ఉన్న సమయంలో నాయకత్వాన్ని మార్చాలని ఎలా లేఖ రాస్తారని, బీజేపీతో కుమ్మక్కై ఇలాంటి పనులు చేస్తున్నారా వ్యాఖ్యలు చేశారు. ఆ లేఖతో తన తల్లి ఎంతో బాధపడిందని చెప్పుకొచ్చారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలు సీడబ్ల్యూసీ సమావేశంలో పెద్ద దుమారాన్ని రేపాయి. సీనియర్ నేతలు ఆజాద్, కపిల్ సిబల్ తప్పుబట్టగా కొద్దిసేపటి తర్వాత కపిల్ సిబల్ తన ట్వీట్‌ను డిలేట్ చేశారు.
సీడబ్ల్యూసీ భేటీ వేదికగానే అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేస్తానని చెప్పి, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలని పార్టీ నేతలకు ఆమె రిక్వెస్ట్ చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ కోరగా మరికొందరు నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోనియా గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగితేనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ బాగుంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.
సీనియర్ నేతలపై రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీజేపీతో కుమ్మక్కయారని రాహుల్ గాంధీ విమర్శించడం.. నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆజాద్ పేర్కొనడంతో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ముస్లిం నేతలు కాంగ్రెస్ నాయకత్వానికి ఎన్నాళ్లు బానిసలుగా ఉంటారని.. మీ సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. గులాంనబీ ఆజాద్ మమ్మల్ని బీజేపీ బీ టీమ్ అని అనేవారని కానీ ఆజాదే బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ అంటున్నారని చెప్పుకొచ్చారు.