ఆ పని చేశాడని టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసేశారు

by Aamani |   ( Updated:2021-12-28 06:30:32.0  )
ఆ పని చేశాడని టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసేశారు
X

దిశ, భీమ్‌గల్: భీమ్‌గల్ మండలం రహత్‌నగర్ గ్రామానికి చెందిన భూక్య మోహన్ టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని తెలియడంతో.. పార్టీ సభ్యత్వం, గ్రామ శాఖ అధ్యక్ష పదవి, పార్టీ నుండి తొలగించడం జరిగిందని మండల అధ్యక్షుడు దోనకంటి నర్సయ్య తెలిపారు. అనంతరం నూతనంగా రహత్‌నగర్ టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా దోంతుల నర్సయ్యని ఏకగ్రీవంగా ఎన్నుకోని‌ నియామక పత్రంను మండల అధ్యక్షుడు దోనకంటి నర్సయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చౌట్పల్లి రవి, జిల్లా జడ్పీ కో- ఆప్షన్ మెంబర్ మోయిజ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు గుణవీర్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు శర్మ నాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్య ప్రకాష్ నాయక్, మండల కార్యదర్శి షఫీ, కవిత గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story