కర్నూల్ పై సెటైర్లు వేసిన రాఘురామ.. ఏమన్నాడంటే

by srinivas |
RRR
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిపై బొత్స ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన అవగాహన లేకుండా రాజధానులపై మాట్లాడటం సరికాదన్నారు. అయినా బొత్స వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు న్యాయరాజధాని కర్నూలు అంశంపైనా ఎంపీ రఘురామ సెటైర్లు వేశారు. క‌ర్నూలులో హైకోర్టు పెట్టేప‌రిస్థితులు ఉన్నాయా? అని నిలదీశారు.

రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య కంటే ప్రభుత్వంపైనే ఎక్కువ కేసులు న‌మోదవుతున్నాయని విమర్శించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకేచోట ఉండాల‌ని ప్రజలు భావిస్తుంటే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం విప‌రీతంగా అప్పులు చేస్తోందని ఎంపీ రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story