విజయసాయిరెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ రఘురామ

by Anukaran |   ( Updated:2021-09-14 10:50:19.0  )
ragurama news
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శలదాడి చేశారు. బహిరంగ సభలలో సాదాసీదా జీవితం గడుపుతున్నానని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఎలా వచ్చారంటూ సెటైర్లు వేశారు. ఢిల్లీకి ప్రత్యేక విమానంలో రావాలంటే రూ. 15 లక్షలు ఖర్చవుతుందని.. విజయసాయికి అంత డబ్బు ఎవరు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయసాయికి నెలకు లక్షన్నర రూపాయల జీతం వస్తుందని.. అలాంటి వ్యక్తి ప్రత్యేక విమానాల్లో ఎలా ప్రయాణించగలరని ప్రశ్నించారు.

లేకపోతే ఏపీ ప్రభుత్వమే ఎంపీని ప్రత్యేక విమానంలో పంపించిందా అనేది సీఎం జగన్ స్పష్టం చేయాలన్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్లు వేయడంలో ఏపీ ముందుందంటూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై రఘురామ మండిపడ్డారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టామని విజయసాయిరెడ్డి చెప్తున్నారని.. అంత భారీ ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టినప్పుడు వ్యాక్సినేషన్ జాబితాలో ఏపీ ఆఖరి స్థానంలో ఎందుకు నిలిచిందో సమాధానం చెప్పాలని రఘురామ నిలదీశారు.

Advertisement

Next Story