‘నన్ను బూచోడిలా చూస్తున్నారు’

by srinivas |
‘నన్ను బూచోడిలా చూస్తున్నారు’
X

దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనను బూచోడ్ని చూసినట్టు చూస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. వైఎస్సార్సీపీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై జాతీయ ఎన్నికల కమిషన్‌తో చర్చించిన అనంతరం మాట్లాడుతూ, తామిద్దరం ఎంపీలం కావడంతో ఆయనకో కమిటీ చైర్మన్ పదవి, తనకో కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని అన్నారు. తనకు ఈ పదవి తప్ప మరే పదవీ లేదన్న ఆయన, ఆయనకు మాత్రం ఎన్నో పదవులు ఉన్నాయని గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి ప్రతి రోజూ ముఖ్యమంత్రితో గంటలకొద్దీ గడుపుతారని చెప్పిన ఆయన, తమకు మాత్రం మూడ్నెల్లకోసారి కూడా సీఎం దర్శనం దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి పార్టీలో ఎంతో పెద్ద వ్యక్తి అని, ఆయన పార్టీకి జనరల్ సెక్రటరీ కూడాను అని గుర్తు చేశారు. తనకు పార్టీ సభ్యత్వం కూడా ఇచ్చారోలేదో కూడా తెలియదని అన్నారు. అలాంటి తనతో అంత పెద్దాయనకు వివాదమేంటో తెలియదని, తనపై ఆయన పగబట్టడం దురదృష్టమని పేర్కొన్నారు. తమది కలతల కాపురమన్న ఆయన, ఎలా సరిదిద్దుకోవాలా? అని ఆలోచిస్తున్నానని చెప్పారు.

Advertisement

Next Story