అనన్య పర్ఫార్మెన్స్‌కు పూరి కాంప్లిమెంట్స్

by Shyam |
అనన్య పర్ఫార్మెన్స్‌కు పూరి కాంప్లిమెంట్స్
X

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఫైటర్’. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమా ద్వారా సౌత్‌కి ఎంట్రీ ఇస్తుండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ మూవీ ‘ఖాళీ పీలీ’లో నటిస్తోంది. ఇషాన్ ఖత్తర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. వ్యభిచార గృహంలో చిక్కుకుపోయిన అనన్య.. భారీ మొత్తంలో డబ్బు దొంగలించి పారిపోతుండగా, టాక్సీ డ్రైవర్ ఇషాన్ తనకు హెల్ప్ చేస్తాడు. ఈ ఇద్దరినీ పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నారు? ఇషాన్, అనన్యలు చిన్నప్పుడే విడిపోయిన స్నేహితులని వారికి ఎలా తెలుస్తుంది? అనేది కథ కాగా.. టీజర్ సూపర్ ఇంప్రెసింగ్‌గా ఉంది. చేజ్, ఎస్కేపింగ్‌లతో ఆకట్టుకుంటున్న ఈ టీజర్‌పై కాంప్లిమెంట్స్ ఇచ్చాడు పూరి.

బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య పాండే ‘ఖాళీ పీలీ’ టీజర్ చాలా బాగా నచ్చిందన్నారు. చాలా ఇంటెన్స్‌గా, గ్రిప్పింగ్‌గా ఉన్న టీజర్‌లో అనన్య పర్ఫార్మెన్స్‌కు క్లాప్స్ ఇచ్చాడు పూరి. ఇషాన్ మ్యాడ్‌నెస్ హై లెవల్‌లో ఉందన్న ఆయన.. ‘ఖాళీ పీలీ’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

Advertisement

Next Story