పూణె మృతుల కుటుంబాలకు పీఎం మోడీ భరోసా..

by Shamantha N |   ( Updated:2021-06-07 22:07:48.0  )
పూణె మృతుల కుటుంబాలకు పీఎం మోడీ భరోసా..
X

దిశ, వెబ్‌డెస్క్ : పూణె కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రధాని మోడీ అండగా నిలిచారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల నష్టపరిహారం ప్రకటించారు. SVS అక్వా టెక్నాలజీస్ ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 17 మంది కార్మికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే ప్రమాద తీవ్రతను సమీక్షించిన ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన అనంతరం నష్టపరిహారం ప్రకటించారు.

Advertisement

Next Story