- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్ఐఎల్‌తో చర్చలు జరుపుతున్న పబ్‌జీ కార్పొరేషన్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మల్టీప్లేయర్ గేమ్ పబ్‌జీని భారత అభిమానుల కోసం మళ్లీ తిరిగి తీసుకొచ్చేందుకు రిలయన్స్ జియోతో పబ్‌జీ కార్పోరేషన్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దేశంలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) టెలికాం విభాగంతో గేమింగ్ సంస్థ చర్చలు ప్రారంభించిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు, పబ్‌జీ కార్పొరేషన్, రిలయన్స్ జియో లీగల్ విభాగాలు భాగస్వామ్యం, ఒప్పందం గురించిన అంశాలపై చర్చిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం వినిపిస్తున్న దాని ప్రకారం..రెండు అవకాశాలున్నాయి. 50-50 ఆదాయ విభజన లేదంటే రిలయన్స్ జియో నెలకు నిర్ణీత సంఖ్యలో వినియోగదారుల ఆధారంగా పబ్‌జీ కార్పోరేషన్ ఆదాయాలకు హామీ ఇవ్వడం. అయితే, దీనికి సంబంధించి ఇరు సంస్థలు అధికారిక ప్రకటన ఇచ్చేవరకు స్పష్టత ఉండదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ ఒప్పందం సఫలమైతే..పబ్‌జీ అతిపెద్ద మార్కెట్‌ను దక్కించుకున్నట్టు అవుతుంది. అలాగే, భారత్‌లోని గేమింగ్ మార్కెట్లోకి రిలయన్స్ ప్రవేశించాలనే లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.