ఉద్యమకారిణికి ఆర్థికసాయం

by Shyam |
ఉద్యమకారిణికి ఆర్థికసాయం
X

దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆపదలో ఉన్న ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నిరూపించారు. కుత్బుల్లాపూర్ డివిజన్ కు చెందిన మణి అనే తెలంగాణ ఉద్యమకారిని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్ రాజు గురువారం ఉద్యమకారులైన విజయరాంరెడ్డి, సంపత్ మాధవరెడ్డి, కస్తూరి బాలరాజు, గౌసుద్దీన్ లచే ఆర్ధిక సహాయం పంపించి అందజేశారు. అలానే ఉద్యమకారులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story