ప్రోటోకాల్ వివాదం.. రైతు వేదికకు భారీ బందోబస్త్

by Aamani |   ( Updated:2021-07-19 02:58:45.0  )
ప్రోటోకాల్ వివాదం.. రైతు వేదికకు భారీ బందోబస్త్
X

దిశ ప్రతినిది, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో రైతు వేదిక భవన ప్రారంభోత్సవం‌లో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ఆదివారం రాత్రి బీజేపీ నేతలు కార్యకర్తలు రైతు వేదిక పై ప్రధాని మోడీ, ఎంపీ అర్వింద్ ఫోటో లేదని తెలిసి ఆందోళన‌కు దిగారు. రైతు వేదిక‌కు కేంద్రం నిధులు ఇస్తున్నందున ప్రోటోకాల్ ప్రకారం వేదిక పై ఫొటోస్ పెట్టాలని పేర్కొన్నారు. శిలాఫలకం పై ఎంపీ పేరుపేట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం రైతు వేదిక ప్రారంభం‌ను అడ్డుకుంటామని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం పోలీస్ లు నందిపేట్‌లో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసారు. బీజేపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేసారు. ఉదయం 11 గంటలకు ప్రారంభించాల్సిన రైతు వేదిక‌ను ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు.

Advertisement

Next Story