- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి ప్రోగ్రాంలో ప్రోటోకాల్ రచ్చ
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. మంథనిలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోపాలపురంలో చెక్ డ్యాం శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేరును అందరికన్నా కింద చేర్చడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పోటాపోటిగా నినాదాలు చేయడంతో గోపాలపురంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రంగంలోకి దిగి కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలువరించారు. ఇదే సమయంలో శిలాఫలకంలో పేర్ల విషయంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ మంత్రి రాజేందర్‌కు శ్రీధర్ బాబు పిర్యాదు చేశారు.
చదువుకున్నోళ్లే ఇలా చేస్తారా..?
చదువుకున్న అధికారులే ఇలా తప్పులు చేస్తే ఎలా, చదుకోని వాళ్ల తీరుగా వ్యవహరిస్తామంటే సరికాదు కదా అని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. అవమానాలు ఎన్ని జరిగానా మంథని ప్రాంత అభివృద్ది కోసం భరిస్తానన్నారు. మంథని ప్రజలు కూడ ఈ విషయాలను గమనిస్తున్నారని, రైతాంగం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగుతామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రైతుల కోసం ఎలాంటి పోరాటాలైనా చేస్తానని, చెక్ డ్యాం నిర్మించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.