చాడ వెంకటరెడ్డి ఇవాళ ఏం చేయమన్నారంటే..?

by Shyam |   ( Updated:2020-06-14 21:55:36.0  )
చాడ వెంకటరెడ్డి ఇవాళ ఏం చేయమన్నారంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: నేడు, రేపు విద్యుత్ కార్యాలయాల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నిరసన కార్యక్రమాల ద్వారా లాక్ డౌన్ సమయానికి సంబంధించి మూడు నెలల్లో వచ్చిన విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రజల బాధలు వర్ణనాతీతమని, ఇలాంటి ఆపద సమయంలో ప్రజలను బిల్లులు కట్టమనడం సరికాదని, వెంటనే ఆ మూడు నెలల కాలానికి సంబంధించిన విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు, రేపు విద్యుత్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story