‘జీవో అమలైతే నెల రోజుల్లో ఆ ప్రాజెక్ట్ ఖాళీ’

by Shyam |
‘జీవో అమలైతే నెల రోజుల్లో ఆ ప్రాజెక్ట్ ఖాళీ’
X

దిశ, నల్లగొండ: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 203తో తెలంగాణ తీవ్రంగా నష్టపోనుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం నార్కట్‌పల్లి, కట్టంగూరు, తిప్పర్తి మండలాల్లోని బత్తాయి, నిమ్మ రైతులను కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 203 ద్వారా నల్లగొండ జిల్లా తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఈ జీవో అమలైతే నెల రోజుల్లో శ్రీశైలం ఖాళీ అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఎస్​ఎల్​బీసీ ద్వారా తెలంగాణకు రాబోయే నీటిని కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు వెయ్యకపోతే రైతుబంధు రాదనడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో తెజస జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story