బస్సు బోల్తా.. 35 మందికి గాయాలు

by srinivas |   ( Updated:2020-12-23 20:24:31.0  )
road accident
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అదుపుతప్పి సిరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story