కరోనా వేళ అక్కరకు రాని హెల్త్ ఇన్సూరెన్స్‌లు

by vinod kumar |   ( Updated:2021-04-23 23:52:48.0  )
కరోనా వేళ అక్కరకు రాని హెల్త్ ఇన్సూరెన్స్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతుండటంతో సామాన్య జనాలు తీవ్ర భయబాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆస్పత్రులకు బారులు తీరుతున్నారు. అయితే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులు హెల్త్ ఉన్నా.. కరోనా చికిత్సకు క్లెయిమ్ చేయడం లేదని బాధితులు వాపోయారు. మరీ తెలుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు హెల్త్ కార్డులను పక్కకు పెట్టి పెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే కరోనా రోగులకు బెడ్లు ఇచ్చి, చికిత్స చేస్తున్నారు. ‘నో హెల్త్ ఇన్సూరెన్స్’ అంటూ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు ముందే చెప్పేస్తు్న్నారు. దీంతో కోవిడ్ పేషెంట్లు పడరాని పాట్లు పడుతున్నారు. కొన్నిచోట్ల ఆస్పత్రుల ఎదుట అంబులెన్సుల్లో, ఆటోల్లో ప్రాణాలు వదిలేస్తున్నారు.

Advertisement

Next Story