మరోసారి వార్తల్లో నిలిచిన సమంత స్టైలిస్ట్.. ఎందుకంటే ?

by Anukaran |   ( Updated:2021-11-08 09:01:45.0  )
మరోసారి వార్తల్లో నిలిచిన సమంత స్టైలిస్ట్.. ఎందుకంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జంట ఎవరైనా ఉన్నారా అంటే అది నాగచైతన్య, సమంతనే. అయితే వీరు వీడాకులు తీసుకొని విడిపోతున్నామని ప్రకటించిన తర్వాత అభిమానులు చాలా షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ చేశారు. ఇదిలా ఉంటే కొంతమంది అభిమానులు సమంతను తిట్టిపోశారు. ఇక తన స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ కారణంగానే వీరు విడిపోయారని రూమర్స్ కూడా వచ్చాయి. అప్పుడు ప్రీతమ్ జుకల్కర్ పేరు వార్తల్లో తెగ హల్ చల్ చేసింది.

ఈ నేపథ్యంలో మరోసారి వార్తల్లో నిలిచారు సమంత స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్. దీపావళి పండుగ సందర్భంగా ఓ స్టార్ హీరో భార్యకు ప్రీతమ్ జుకల్కర్ స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరి భార్య అనుకుంటున్నారా.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహలత రెడ్డికి ప్రీతమ్ జుకల్కర్ స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు టాక్. ఇందులో భాగంగానే దీపావళి పండుగ సందర్భంగా ప్రీతమ్ రెడీ చేసిన న్యూ డ్రెస్‌ను స్నేహ వేసుకుందంట. ప్రస్తుతం ఆ ఫొటోలను స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వాటిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంది సూపర్ స్నేహ.. నైస్ లుక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సమంత స్టైలిస్ట్‌, డిజైనర్‌గా రకరకాల వైరైటీ దుస్తులను క్రియేట్‌ చేస్తాడనే విషయం తెలిసిందే.

చైతూ షాకింగ్ డెసిషన్.. సమంత దారిలోనే వెళ్లనున్నారా ?

Advertisement

Next Story