- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దోమల నివారణపై అవగాహన
దిశ, న్యూస్బ్యూరో: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా దోమలను నివారించేందుకు ఇంటింటికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ‘ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిముషాలు’ కార్యక్రమాన్ని మేయర్ నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంటమాలజీ విభాగంతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇల్లు, పరిసరాలను శుభ్రoగా ఉంచుకుని, పూల కుండీలు, డ్రమ్ములు, ట్యాంకుల్లో నిల్వ వున్న నీటిని కనీసం వారానికి ఒకసారి అయినా తొలగించడం అలవాటుగా మార్చుకోవాలని ఈ సందర్భంగా మేయర్ విజ్ఞప్తి చేశారు. ఇంటి పైకప్పులు, పనికిరాని ప్లాస్టిక్, ఇనుప వస్తువులు, టైర్లలో నిలిచివున్న నీటిని తొలగించడం వలన దోమల గుడ్లు లార్వాలు చనిపోతాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే దోమల వ్యాప్తిని నియంత్రణ విజయవంతమవుతుందని మేయర్ పేర్కొన్నారు.