గాంధీ ఆస్పత్రి వద్ద గర్భిణి దారుణ హత్య

by Sumithra |
గాంధీ ఆస్పత్రి వద్ద గర్భిణి దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: గర్భిణిని చూడగానే ఎవరికైనా సాయం చేయాలని అనిపిస్తది. ఎందుకంటే ఒక స్త్రీ గర్భం దాల్చిన నుంచి ప్రసవించిన తర్వాత కొన్ని రోజుల వరకు స్త్రీ బాధ వర్ణానాతీతం. వారి గురించి ఎంతచెప్పినా తక్కువే. అందుకే గర్భం దాల్చిన స్త్రీలను ప్రేమగా చూస్తుంటారు. వారికి ఎలాంటి హాని కలిగించబోరు. కానీ, ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. మద్యానికి డబ్బులివ్వలేదని నిండు గర్భిణిని హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది.

గౌతమ్, మహాలక్ష్మీ అనే వీరిద్దరూ భార్యాభర్తలు. వీరు గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ అక్కడే జీవనం గడుపుతూ ఉంటారు. మహాలక్ష్మీ ప్రస్తుతం నిండు గర్భిణి. అయితే, మద్యానికి డబ్బులివ్వలేదని ఆమెను గౌతమ్ దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story