ప్రియాంక చోప్రా- నిక్ విడాకులు.. పోస్ట్ వైరల్

by Anukaran |   ( Updated:2021-07-12 06:41:55.0  )
viral news
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ త్వరలో విడిపోబోతున్నారట. ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో జంటల పెళ్లిళ్లు పెటాకులు అయిన సంగతి తెలిసిందే.. ఇంకో పదేళ్లలో ప్రియాంక- నిక్ జంట కూడా విడిపోనున్నట్లు చెప్తున్నాడు బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే (కమల్ ఆర్. ఖాన్). బాలీవుడ్ లో తన సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడు వివాదాలను కొనితెచ్చుకునే ఈయన తాజాగా ప్రియాంక- నిక్ జంటపై ఘాటు వ్యాఖ్యలు చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోయాడు. తాజాగా ఆయన ట్విట్టర్ లో బాలీవుడ్ ఆదర్శ జంటలపై ప్రిడిక్షన్ చెప్పాడు. “ప్రియాంకకు ఆమె భర్త నిక్‌ జోనస్‌ మరో 10 ఏళ్లలో విడాకులు ఇవ్వడం తథ్యం” అని చెప్తూ ట్వీట్‌ చేశాడు.అంతేకాదు నా ప్రిడిక్షన్ నిజమవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక అతగాడి జోస్యంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. చక్కగా కాపురం చేసుకుంటున్న జంట మధ్యలో చిచ్చు పెట్టడానికి వచ్చావా..? అని కొందరు అంటుంటే.. ప్రియాంక, నిక్ బలమైన ప్రేమబంధంతో ముడిపడి ఉన్నారని.. వారిని విడదీయడం ఎవరి వలన కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించే కేఆర్‌కే మరికొన్ని విషయాల్లోనూ జోస్యం చెప్పుకొచ్చాడు. కరీనా, సైఫ్ తమ కుమారుల పేర్లు తప్పుగా ఎంచుకున్నందుకే వారు సక్సెస్ కాలేదని చెప్పుకొచ్చాడు. మరి ఈ ట్వీట్స్ పై ప్రియాంక స్పందిస్తుందేమో చూడాలి.

Advertisement

Next Story