రాహుల్‌కు ప్రకాశ్ రాజ్ మద్దతు

by Shyam |   ( Updated:2020-03-09 06:20:25.0  )
రాహుల్‌కు ప్రకాశ్ రాజ్ మద్దతు
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు మద్దతిస్తున్నారు నటుడు ప్రకాశ్ రాజ్. పబ్‌ గొడవ ఘటనపై రాహుల్‌తో చర్చించిన ప్రకాశ్ రాజ్… తర్వాత అతన్ని తీసుకొని అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌తో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన…. ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. పబ్‌లో తనపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన రాహుల్… తర్వాత ట్విట్టర్‌లో కేటీఆర్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో ఈ కేసును ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌కు అప్పగించారు కేటీఆర్. రాహుల్‌పై దాడి చేసింది ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితీశ్ రెడ్డి కాగా… ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే రాహుల్‌కు న్యాయం జరగాలంటూ రంగంలోకి దిగారు ప్రకాశ్ రాజ్. కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ చిత్రంలో రాహుల్, ప్రకాశ్ రాజ్‌లు కలిసి నటిస్తుండగా… ఈ విషయం ప్రకాశ్ రాజ్‌కు తెలిసి వినయ్ భాస్కర్‌ను కలిసినట్లు సమాచారం.

అయితే ప్రకాశ్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్ కేవలం సినిమా పనిమీదే తనను కలిసినట్లు తెలిపారు వినయ్ భాస్కర్. సినిమా ఫంక్షన్ గురించి మాత్రమే చర్చించామని, రాహుల్ పబ్ గొడవ గురించి ఏం మాట్లాడుకోలేదని తెలిపారు.

Tags: Rahul Sipligunj, Prakash Raj, Vinay Bhaskar

Advertisement

Next Story