‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్.. ఖుష్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

by Shyam |
radhe shyam
X

దిశ, సినిమా : ప్రభాస్ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ‘రాధేశ్యామ్’ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పాన్ ఇండియా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను భారీఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేసిన మేకర్స్.. ఇదే ఈవెంట్‌లో ట్రైలర్‌ కూడా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుండగా.. మరో రెండు ప్రత్యేకతలు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను ‘జాతిరత్నాలు’ హీరో నవీన్ పొలిశెట్టి హోస్ట్ చేయడం ఒకటైతే.. ‘రాధేశ్యామ్’ మూవీ ట్రైలర్ అభిమానుల చేతుల మీదుగా విడుదలవడం మరొకటి. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇలా అభిమానుల చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేస్తుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Advertisement

Next Story