జాతీయ జెండాలు ఎగురవేయాలి:పీపీసీసీ

by Shamantha N |
జాతీయ జెండాలు ఎగురవేయాలి:పీపీసీసీ
X

ఛండీగఢ్: మే1న మేడే (కార్మిక దినోత్సవం) సందర్భంగా నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) పై పోరాటానికి మద్దతు తెలుపుతూ శుక్రవారం ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని పీపీసీసీ(పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) పిలుపునిచ్చింది. దేశం విపత్కాలంలో ఉన్న ఈ తరుణంలో కార్మిక దినోత్సవం కూడా కలిసి వస్తుండటంతో కేంద్ర సాయానికి పంజాబ్‌కు ఉన్న హక్కును చాటిచెబుతూ జాతీయ జెండాలను ఎగురవేయాలని కార్యకర్తలందరికీ పిలుపునిచ్చినట్టు పీపీసీసీ చీఫ్ సునీల్ జాఖర్ తెలిపారు. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ మే 3వ తేదీ వరకూ కొనసాగనున్న నేపథ్యంలో ఈసారి మేడే వేడుకలు ఎలాంటి ఆర్భాటం లేకుండా కేవలం కార్మిక కార్యాలయాలకే పరిమితం కానున్నాయి.

Tags: ppcc cheif, national flag, hosting, evey house, may day, covid 19, lock down

Advertisement

Next Story