- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'పేద ప్రజల ఇంటి కిరాయిలు ప్రభుత్వమే చెల్లించాలి'
దిశ, న్యూస్ బ్యూరో: రైతులకు వాన కాలం పంటకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజల ఇంటి కిరాయిలు ప్రభుత్వం చెల్లించాలని ఆయన కోరారు. సోమవారం అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా ఇంటి యజమానులు కిరాయిదారులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారన్నారు. ఇలాంటి సమయంలో లక్షలు ఖర్చుపెట్టి నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులో భాగంగా పేద ప్రజల ఇండ్ల కిరాయిలు కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కరెంటు బిల్లు, వాటర్, ఇంటి పన్ను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రజలు డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేరని తక్షమే సీఎం కేసీఆర్ స్పందించి ప్రజలను ఆదుకోవాలని కోరారు. పరిశ్రమలకు కూడా కరెంటు బిల్లులు మాఫీ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను ఆదుకోవాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే విధంగా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలని కోరారు.
tags: Congress,Jagga Reddy,Kcr,kishan reddy,farmer,seeds