- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంగ్లీష్ మీడియమే ముద్దు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయానికి ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది.అయితే ప్రస్తుత సమాజంలో ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యాన్ని గుర్తించేలా ఏపీ ప్రభుత్వం ప్రతి జిల్లాలో పేరెంట్స్ కమిటీలను నియమించింది. ఈ కమిటీలు ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యతను గుర్తించి సుమారు 45000వేల పేరెంట్స్ కమిటీ తీర్మానం కాపీలను బుధవారం సచివాలయానికి పంపించారు.కాగా, ప్రభుత్వ నిర్ణయానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు లభించడం చారిత్రాత్మకం అని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఆంగ్ల మాద్యమం వలన భవిష్యత్తులో పేద పిల్లల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని ఆయన పేర్కొన్నారు. పేరెంట్స్ కమిటీలు అందజేసిన సూచనలు, సలహాలను తప్పకుండా తమ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని మంత్రి వివరించారు.ఇదిలా ఉండగా ఆంగ్ల మీడియం తప్పనిసరి అనే నిబంధనతో ఏపీ తెలుగుభాషను హరించేలా చేస్తుందని ప్రతిపక్ష టీడీపీ ఆందోళనలు చేపట్టింది.ఈ మేరకు ప్రభుత్వం పేరెంట్స్ కమిటీలను నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుల బాషా సామర్థ్యాన్ని జిల్లా కలెక్టర్లు సమీక్షిస్తారని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.