పూజా‌ హెగ్డే‌కు చిరంజీవి పర్సనల్ మెసేజ్.. ఎందుకో తెలుసా?

by Shyam |
Acharya14
X

దిశ, సినిమా: బుట్టబొమ్మ పూజా హెగ్డే బిజీ యాక్ట్రెస్‌గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతోంది. ముఖ్యంగా తెలుగులో వరుసగా ఐదు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న భామ.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సక్సెస్‌‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో సమాధానాలు ఇచ్చిన పూజ.. మెగాస్టార్‌ చిరంజీవి తనను అప్రిషియేట్ చేస్తూ పర్సనల్ మెసేజ్ పెట్టినట్లు తెలిపింది.

‘ఆచార్య’లో స్క్రీన్ షేర్ గురించి పక్కన పెడితే ఇలా అప్రిసియేషన్ మెసేజ్ పంపించడంతో ఎమోషనల్ అయిపోయానని, ఒక్కసారిగా కళ్లలో నీళ్లు వచ్చేశాయని తెలిపింది. ఇక కేజీఎఫ్ స్టార్ యశ్‌ను కన్నడ ఇండస్ట్రీని గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తాడన్న బ్యూటీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను రియల్ మ్యాన్ అని పొగిడేసింది. ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో నటించడమే డ్రీమ్ అన్న పూజ.. త్వరలోనే కల సాకారమవుతుందనే అనుకుంటున్నట్లు తెలిపింది. ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’తో టాలీవుడ్‌లో రెండు వరుస హ్యాట్రిక్‌ హిట్స్ అందుకున్న నటిగా రికార్డ్ సృష్టించేందుకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఫ్యాన్స్. ఇక డైరెక్టర్ హరీశ్ శంకర్ పూజా హెగ్డే చాలా బిజీగా ఉందని చెప్పేందుకు.. ‘నీ ఫోన్ కాల్స్ డేట్స్ ఎవరు చూసుకుంటున్నారు? జస్ట్ ఫోన్ కాల్స్..’ అని ప్రశ్నించాడు.

Advertisement

Next Story

Most Viewed