AP Politics: నేడు గవర్నర్‌తో వైసీపీ నేతలు భేటీ..

by Indraja |   ( Updated:2024-06-06 12:09:17.0  )
AP Politics: నేడు గవర్నర్‌తో వైసీపీ నేతలు భేటీ..
X

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వైసీపీ నేతలు గవర్నర్‌‌ను కలవనున్నారని సమాచారం. ఇప్పటికే టీడీపీ దాడులకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి X వెదికగా ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి X వెదికగా ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ముఠాల దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది అని పేర్కన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని.. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని అన్నారు.

ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు. గౌరవ గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకుని దాడుచే చేస్తున్న వారిని అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నామని ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా ఇదే విషయంపై ఈ రోజు సాయంత్రం వైసీపీ నేతలు గవర్నర్‌‌ను కలిసి టీడీపీపై ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story