మునుగోడులో ఊహించని ట్విస్ట్.. KCRతో CPI నేతల భేటీ!

by GSrikanth |   ( Updated:2022-08-20 04:50:51.0  )
మునుగోడులో ఊహించని ట్విస్ట్.. KCRతో CPI నేతల భేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దుబ్బాక, హుజురాబాద్ బైపోల్‌లో గెలచి మాంచి ఊపుమీద ఉన్న బీజేపీకి ఎలాగైనా చెక్‌ పెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీని ఓడించే పార్టీకి మద్దతిస్తామని కమ్యూనిస్టులు ప్రకటించగా.. తమతో కలిసి రావాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రగతిభవన్‌లో సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డితో కేసీఆర్ దాదాపు రెండు గంటల పాటు కీలక చర్చలు జరిపారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. దీనికి స్పందించిన సీపీఐ నేతలు మునుగోడు బైపోల్‌లో సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ మునుగోడులో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. అంతేగాక, ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే కమ్యూనిస్టులతో కలిసి పోవాలని భావించిన రేవంత్ రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు అయింది. దీనిపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story