శిక్ష రద్దు చేయాలంటూ రాహుల్ పిటిషన్.. ఏప్రిల్ 13కు వాయిదా వేసిన సూరత్ సెషన్స్ కోర్టు

by Javid Pasha |   ( Updated:2023-04-03 10:11:35.0  )
శిక్ష రద్దు చేయాలంటూ రాహుల్ పిటిషన్.. ఏప్రిల్ 13కు వాయిదా వేసిన సూరత్ సెషన్స్ కోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటి పేరు వ్యవహారానికి సంబంధించి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష వేసిన విషయం తెలిసిందే. కాగా తనపై విధించిన రెండేళ్ల జైలు శిక్ష రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. రాహల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా వేసింది.

కాగా అంతకు ముందు సూరత్ కోర్టు రాహుల్ బెయిల్ ను మే 3కు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సూరత్ సెషన్స్ కు వెళ్లిన రాహుల్ గాంధీ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బగేల్, సుఖ్వీందర్ సింగ్ సుఖ్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed