- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Revanth Reddy : రేవంత్ రెడ్డి కి దడ పుట్టిస్తున్న సునీల్ రిపోర్ట్
దిశ, తెలంగాణ బ్యూరో : మునుగోడు పరిస్థితులపై తాజా సర్వే కీలక విషయాలను బయటపెట్టింది. ఇప్పటికే మూడు సర్వేలు పూర్తి చేసిన కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం.. చివరి సర్వేలో పార్టీకి మింగుడుపడని అంశాన్ని వెల్లడించింది. కొంతమంది కారణంగా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అధ్వానంగా మారుతుందని, ఇక్కడ పార్టీ శ్రేణులు చేజారిపోతున్నారని, మొన్నటిదాకా బలంగా ఉన్న పార్టీ ఇప్పుడు బలహీనపడుతుందని వెల్లడించారు. సొంతపార్టీపైనే సునీల్ టీం ఇచ్చిన రిపోర్ట్ పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వ్యవహరాన్ని సైతం ఈ నివేదికల్లో వెల్లడించారు. ఎంపీ వెంకట్ రెడ్డి ప్రోద్బలంతో పార్టీని కొంతమంది వీడుతున్నారనే అనుమానాలను వ్యక్తం చేశారు.
40 శాతం ఖాళీ
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డితో ముందుగా కాంగ్రెస్ నేతలు వెళ్లలేదని, చాలా రోజులు ఎటూ వెళ్లకుండా పార్టీలోనే ఉన్నారని తేలింది. అయితే, ఆ తర్వాత హస్తం నేతల్లో విభేదాలు, మునుగోడు నేతలను పట్టించుకోకపోవడం, ఇతర పార్టీలు లక్షలకు లక్షలు ఆఫర్లు ప్రకటించడం, సొంత పార్టీ నుంచి స్థానిక నేతలకు కనీసం ప్రచారానికి ఖర్చు కూడా ఇవ్వకపోవడం వంటి కారణాలతో టీఆర్ఎస్, బీజేపీ వైపు మొగ్గు చూపారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన ప్రలోభాలకు తలొగ్గారని సర్వేలో వెల్లడైంది. దీంతో ఈ నెల 4వ తేదీ వరకు 40 శాతం పార్టీ నేతలు కాంగ్రెస్ ను వీడిపోయారంటూ తేల్చారు.
చుట్టం చూపుగా నేతలు
ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ నుంచి కీలక నేతలు మునుగోడులో మకాం వేస్తే.. కాంగ్రెస్ రాష్ట్ర నేతలు మాత్రం అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నట్లు వెల్లడవుతోంది. మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఈ సెగ్మెంట్ లో తిరుగుతున్నా పార్టీ నేతలతో సక్రమైన సయోధ్య కుదరడం లేదు. స్థానిక నేతలను పార్టీ వెంట తిప్పుకునేందుకు దామోదర్ రెడ్డి ప్రయత్నాలేమీ చేయడం లేదని పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అటు ఉత్తమ్, జానారెడ్డి వంటి నేతలు కూడా ఎప్పుడో ఓసారి రావడం, ఒకే సమావేశంలో పాల్గొనడం మినహా స్థానిక నేతలతో చర్చలు చేయకుండానే వెళ్తున్నారు. దీంతో తమ ఇబ్బందులు చెప్పుకునేందుకు సరైన నేత లేరనే అభిప్రాయాలు పార్టీ నేతల నుంచి వచ్చాయి. మునుగోడులోనే మకాం వేస్తానన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మునుగోడుకు తక్కువ సమయం కేటాయిస్తున్నారే విమర్శలు సైతం వచ్చాయి. మండలాలకు ఇంచార్జీలను వేసినా.. పార్టీ నుంచి సరైన ప్రణాళిక లేకపోవడంతో ఇంచార్జీలతో కలిసి వచ్చేదేమీ లేదని సునీల్ సర్వేలో తేటతెల్లమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో ఉండటం కంటే తమకు అవకాశాలు వస్తున్న పార్టీలోకి వెళ్లడం మంచిదేననే ఆలోచనతో స్థానిక నేతలు పార్టీని వీడుతున్నట్లు తేల్చారు.
అన్నదమ్ముల బంధం
రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి, సొంత పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురువేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణంగా మునుగోడులో పార్టీ కేడర్ ఇబ్బందులు పడుతుందని, కొన్ని సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా మారేందుకు వెంకట్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారనే అనుమానాలు సునీల్ సర్వే బృందం పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల మునుగోడు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను సైతం ఈ టీం అధిష్టానానికి నివేదించింది. మునుగోడులో కొంతమేరకు ఎంపీ కోమటిరెడ్డి ప్రభావితం చేస్తున్నారని, ఆయన వెంట ఉండే నేతలు ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ కు వెళ్లారని సర్వేలో స్పష్టమైంది. అయితే, కోమటిరెడ్డి ఉద్దేశపూర్వకంగానే తన వర్గాన్ని రాజగోపాల్ రెడ్డి వైపు పంపిస్తున్నారనే అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఇటీవల పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా బలం చేకూర్చుతున్నాయి. తాజాగా మునుగోడులో సమావేశమైన కాంగ్రెస్ శ్రేణులు.. తమపై వెంకట్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని, రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలువాలని చెప్తున్నాడని, అందుకే పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నారని సమావేశంలో బహిరంగంగా విమర్శలు చేయడం వివాదమవుతోంది. దీనిపై టీపీసీసీ నుంచి ఇంకా రిప్లై ఇవ్వడం లేదు.
లేటెస్ట్ రిపోర్ట్ సబ్మిట్
ఈ నెల 4 వరకు తుది విడుత సర్వేను పూర్తి చేసిన సునీల్ కనుగోలు.. ఆ తర్వాత పరిణామాలను సైతం ఏఐసీసీకి పంపించారు. ప్రియాంకతో పాటుగా కేసీ వేణుగోపాల్ కు అత్యవసర రిపోర్ట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏఐసీసీ నేతలు రాహుల్ వెంట భారత్ జోడో యాత్ర ప్రారంభానికి వెళ్లినప్పటికీ.. ఏఐసీసీకి మెయిల్ రూపంలో నివేదిక ఇచ్చినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వెల్లడించారు. తాజాగా మునుగోడులో జరిగిన కాంగ్రెస్ సమావేశం, అందులో ఎంపీ వెంకట్ రెడ్డిపై చేసిన విమర్శలు, ఆయా గ్రామాల నేతలకు ఎంపీ వెంకట్ రెడ్డి చేసిన ఫోన్ కాల్స్ రికార్డులను టీపీసీసీ తో పాటుగా ఏఐసీసీకి కూడా అందించినట్లు చెప్పారు.
మరో మూడు ప్రైవేట్ సర్వేల్లోనూ అదే రిపోర్ట్
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ టీంతో పాటుగా టీపీసీసీ, మునుగోడులో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు సొంతసర్వేలు కూడా పూర్తి చేయించారు. అయితే, మూడు సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్టులు దాదాపుగా ఒకేలా ఉన్నాయని చెప్తున్నారు. ముందుగా ఉన్న బలం ఇప్పుడు లేదని, పార్టీ అభ్యర్థి ప్రకటన చేయకపోవడం కూడా మైనస్ గా మారిందని సర్వేలో తేలిందని పార్టీ నేతలు గాంధీభవన్ లో గుసగుసలాడుతున్నారు.
Also Read : ఆ వార్త ఎలా బయటకు వచ్చిందో తెలియదు.. జగ్గారెడ్డి యూటర్న్..!!
- Tags
- RevanthReddy