- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pawan Kalyan: ఆ విషయంలో సొంత రక్తానికైనా ఎదురు తిరుగుతా.. పవన్ కళ్యాణ్
దిశ వెబ్ డెస్క్: ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిద్దలూరులో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే జనసైనికుడు వెంకయ్య నాయుడుని వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళను పసుపు కుంకాలకు దూరం చేసిన దుర్మార్గులు వైసీపీ ఎమ్మెల్యే అని దుయ్యబట్టారు.
అలానే రానున్న ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని, ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేను ఇంటికి పంపించాలని ఆయన తెలిపారు. బూతులు తిట్టే ప్రభుత్వాన్ని కాకుండా, గోతులు పూడ్చే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే కొడాలి నానిను తాను తిట్టాలి అని అనుకోవడం లేదని, కానీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే సొంత రక్తానికైనా ఎదురు తిరుగుతానని అన్నారు.
అలానే బూతులు తిట్టే వాళ్లను మోకాళ్లపై కూర్చుని పెట్టేలా ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి కోటలు బద్దలు కొట్టి, అధికార పార్టీ నేతల బూతులకు గోరి కడతామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇక రానున్న ఎన్నికల్లో వచ్చేది కూటమి ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు.
Read More..
అలా చేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లే.. ఎన్నికల వేళ CM జగన్ షాకింగ్ కామెంట్స్