- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసీ నిర్ణయం సరైంది కాదు.. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే
దిశ, వెబ్ డెస్క్: శివసేన పార్టీ, ఆ పార్టీకి చెందిన సింబల్ ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందినవే అంటూ తాజాగా ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తప్పుబట్టారు. పార్టీలో గిట్టని వారుంటే బయటకి వెళ్లి వేరే పార్టీ పెట్టుకోవచ్చని, రాజ్ థాక్రే శివసేనను విబేధించి తన సొంత పార్టీ పెట్టుకున్నారని గుర్తు చేశారు. అంతేగానీ అప్రజాస్వామికంగా పార్టీని లాక్కోవడం సరికాదన్నారు. శివసేన పార్టీని బాల్ థాక్రే స్థాపించారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని, ఆ పార్టీని ఎవరూ నడపాలనేది బాల్ థాక్రే ఎప్పుడో నిర్ణయించారని అన్నారు.
ఆయన తర్వాత ఆ పార్టీని ఉద్ధవ్ థాక్రే నడపాలనేది బాల్ థాక్రే కోరిక అని, కానీ ఈసీ నిర్ణయం అందుకు విరుద్ధంగా ఉందని చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని, మళ్లీ మొదటి నుంచి ప్రారంభించి అనుకున్నది సాధించాలని ఉద్ధవ్ థాక్రేకు సూచించారు.
Also Read...
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్టేషనరీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!