వంగి వంగి కేసీఆర్‌ కాళ్లు మొక్కిన మహిళా మంత్రి (వీడియో)

by GSrikanth |   ( Updated:2022-10-18 13:12:56.0  )
వంగి వంగి కేసీఆర్‌ కాళ్లు మొక్కిన మహిళా మంత్రి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే హడావిడి మామూలుగా ఉండదు. గులాబీ బాస్ కళ్లలో పడేందుకు ఎంతటి సాహసాన్నైనా చేస్తుంటారు. తాజాగా.. ఓ మహిళా మంత్రి కూడా అలాగే వ్యవహరించారు. కేసీఆర్ ఆశీర్వాదం కోసం వంగి వంగి కాళ్లు మొక్కడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న ఓ సమావేశంలో రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో వేదికపైకి వచ్చిన కేసీఆర్ కాళ్లు మొక్కేందుకు మంత్రి సత్యవతి చేసిన ప్రయత్నం మామూలుగా లేదు. ఎట్టకేలకు గులాబీ బాస్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం మాత్రం తీసుకున్నారు. మంత్రితో పాటు వేదికమీద ఉన్న టీఆర్ఎస్ నేతలంతా కేసీఆర్ ఆశీర్వాదం కోసం పోటీ పడటం గమనార్హం. దీనిని కొందరు కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి స్పందించిన విపక్ష నేతలు రాష్ట్రంలో దొరల పాలన సాగుతోందని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఇటీవల హైదరాబాద్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పులు అందించడాన్ని టీఆర్ఎస్ నేతలంతా తప్పుబట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాత్ నేతల కాళ్ల వద్ద పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: జగ్గారెడ్డి

Advertisement

Next Story