Telangana Politics: సామాన్యుడికి.. పెద్దింటి బిడ్డకు మద్య పోటీ

by Indraja |
Telangana Politics: సామాన్యుడికి.. పెద్దింటి బిడ్డకు మద్య పోటీ
X

దిశ, పెద్దపల్లి ప్రతినిధి: పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి సామాన్యుడికి..పెద్దింటి బిడ్డకు మద్య పోటీ జరగనుందని బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కు కొప్పుల ఈశ్వర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిందన్నారు.

నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ఛీ కొడుతున్నారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను పార్లమెంట్‌కు పంపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. వేల కోట్ల రూపాయల అభ్యర్థితో, నిరుపేదనైన తాను త‌లపడుతున్నానని.. ప్రజలు తనకు మద్దతు ఇవ్వాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, నాయకులు మేకల మల్లేశంతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story