కర్ణాటక రిజల్ట్స్ : ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన బస్వరాజు బొమ్మై

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-13 08:06:07.0  )
కర్ణాటక రిజల్ట్స్ : ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన బస్వరాజు బొమ్మై
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హవేరిలో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్‌లో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై చిక్కుకుపోయారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో వాహనంలో నుంచే ఆయన కొంత మందిని పలకరించారు. కాగా షిగ్గావ్ నియోజకవర్గం నుంచి బొమ్మై గెలిచారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోని స్థానాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 133 స్థానాల్లో హస్తం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Also Read...

కర్నాటక రిజల్ట్: సీఎం పోస్ట్‌పై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story