కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెర

by Javid Pasha |
కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెర
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. దాదాపు నెల రోజులుగా అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడిఎస్ వంటి పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేశాయి. బీజేపీ తరఫున ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా తదితరులు ప్రచారం నిర్వహించగా... కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

కాగా 224 స్థానాల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు గాను మొత్తం 2,613 మంది బరిలో నిలిచారు. ఇక ఈ ఎన్నికలకు గాను ఏప్రిల్ 13న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ కు ఏప్రిల్ 20 తుది గడువు కాగా.. మే 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. అదే విధంగా మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed